హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

HNK: అప్పుల బాధతో పురుగు మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వేలేరు మండలం కన్నారం చెందిన కాశబోయిన కుమారస్వామి (38) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటలు సరిగా పండక అప్పులు పెరగడంతో వాటిని తీర్చలేక ఈ నెల 3న పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్సై దిలీప్ తెలిపారు. కేసు నమోదు చేశారు.