హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కరీంనగర్‌లో ఉద్యోగ మేళా

కరీంనగర్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ లులూ ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్‌లో అప్రెంటిస్‌షిప్, క్యాషియర్, సేల్స్‌ అసోసియేట్, హెల్పర్ విభాగాల్లో 200 ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు బయోడేటా సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు.