హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వీధి కుక్కల స్వైర విహారం

SKLM: ఎచ్చర్ల మండలం చినరావుపల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. గ్రామంలోని ప్రధాన వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో వాహనదారుల వెంటపడుతున్నాయి. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.