హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

VKB: మహిళలు తమ సమస్యలను భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా నమ్మకమైన వాతావరణం కల్పించాలని ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. వికారాబాద్ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ.. మహిళలు, బాలికల ఫిర్యాదులపై సత్వర స్పందన, సమర్థవంతమైన దర్యాప్తు చేయాలనీ ఆదేశించారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సూచించారు.