హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదం.. డ్రైవర్ రిమాండ్!

VKB: అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ నెల 3న ప్రైవేట్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పాళ్త్యా వాసుదేవ్ (మెదక్ జిల్లా)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రఘురాం తెలిపారు.