JGL: ధర్మపురి పరిధిలోని నక్కలపేట–దోనూర్ మధ్య ఉన్న పురాతన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో వంతెన వణుకుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
పురాతన వంతెన.. వాహనదారుల్లో ఆందోళన


