హైదరాబాద్: 28°C
తెలంగాణ

భోజనంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

సిద్దిపేట పట్టణంలోని మైనార్టీ, బీసీ బాలుర గురుకుల పాఠశాలలను కలెక్టర్ కె. హైమావతి సందర్శించి, భోజన నాణ్యతను పరిశీలించారు. వంటగది పరిసరాల్లో శుచి, శుభ్రత పాటించాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన బియ్యంతో ఆహారం అందించాలన్నారు. విద్యార్థుల విద్య, వసతి విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.