హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

GDWL: సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని గద్వాల్ జిల్లా పోలీస్ బృందం సభ్యులు రాధమ్మ, హనుమంతు పేర్కొన్నారు. అయిజ మండలం సంకాపూర్‌లో  సోమవారం రాత్రి సైబర్ నేరాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలన్నారు.