హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త సేకరణ టెండర్‌పై ఆరోపణలు

కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త సేకరణ టెండర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు మార్చి టెండర్‌ను అనుకూలంగా నిర్వహించారనే విమర్శలు ఉన్నాయి. ఏటా రూ.40 లక్షలకు పైగా ఆదాయం రావాల్సి ఉండగా, ఈసారి కేవలం రూ.15 లక్షలకే టెండర్ అప్పగించడంతో బల్దియాకు రూ.25 లక్షల ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఎవరున్నారనే చర్చ జోరుగా సాగింది.