హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీనివాసాచారి సేవలు ప్రశంసనీయం: కలెక్టర్

SRCL: ముఖ్య ప్రణాళిక అధికారి, ఇన్‌ఛార్జ్ డీపీఆర్ఓ పీబీ శ్రీనివాసాచారి అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. 38 ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం సమీకృత కార్యాలయాల సముదాయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఎన్నికలు, జనగణన, మహాశివరాత్రి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారని కొనియాడారు.