హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పంటలకు నీరందక రైతుల ఆవేదన'

SRD: సంగారెడ్డి‌లో వోల్టేజ్ సమస్యతో పొలాలకు సరిపడా నీరందడం లేదని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ లో వోల్టేజ్ వల్ల బోరు మోటార్లు తిరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.