హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

MDK: పంట పొలానికి నీరు పారించేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన రామాయంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటిపల్లి తండాకు చెందిన బాదావత్ బన్సీలాల్ (45) రాత్రి పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.