హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

4 లారీలపై కేసులు.. రూ.12 వేలు జరిమానా

కోనసీమ: 216 జాతీయ రహదారిపై అనధికారికంగా పార్కింగ్ చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం భట్నవిల్లి వై జంక్షన్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన 4 లారీలపై మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసి, రూ. 12 వేలు జరిమానా విధించామన్నారు. జాతీయరహదారిపై అనధికారికంగా పార్కింగ్ చేయరాదన్నారు.