హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్... టీడీపీలోకి చేరికలు

కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక గ్రామానికి చెందిన పలువురు YCP కార్యకర్తలు సోమవారం టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడు గాలిదేవర వసంతరాయుడు ఆధ్వర్యంలో మండపేట పార్టీ కార్యాలయంలో MLA వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై TDPలో చేరినట్లు తెలిపారు.