హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ సేవలను పరిశీలించిన అధికారులు

WGL: జిల్లాలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, పోషకాహార కార్యక్రమాలపై మహారాష్ట్ర WCD శాఖ అధికారులు సోమవారం పరిశీలన చేపట్టారు. అ. కమిషనర్ విజయ్ క్షీర్సాగర్ ఆధ్వర్యంలోని బృందం ఎనుమాముల మార్కెట్లోని కేంద్ర వంటశాలను సందర్శించింది. అనంతరం సుందరయ్య నగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.