హైదరాబాద్: 28°C
తెలంగాణ

MPLADS నిధులు పెంచాలి: ఎంపీ

VKB: చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి 2026-27 సంవత్సరానికి లోక్‌సభ MPLADS కమిటీ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన కమిటీ తొలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ఏటా కేటాయిస్తున్న రూ.5 కోట్ల MPLADS నిధులు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. నిధుల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కమిటీ ద్వారా కృషి చేస్తానని తెలిపారు.