హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిందీ వినియోగం పెంచాలి: డివిజనల్ మేనేజర్

NLG: నల్గొండలోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) డివిజనల్ కార్యాలయంలో సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించిన హిందీ పక్షోత్సవాలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. హిందీ భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.