హైదరాబాద్: 28°C
క్రీడలు

భారీ రికార్డుపై అభిషేక్ శర్మ కన్ను..!

భారత్-వెస్టిండీస్ మధ్య రేపు లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ 74 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని తాకనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రోహిత్, కోహ్లీ, సూర్య, హార్దిక్, రాహుల్ సరసన అభిషేక్ ఆరో భారత బ్యాటర్‌గా చేరే అవకాశం ఉంది.