హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ పిల్లలకు దాతల చేయూత

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో అనాథ పిల్లలకు దాతలు అందించిన సాయం అభినందనీయమని సర్పంచ్ హనుమంతరావు తెలిపారు. గ్రామానికి చెందిన ప్రకాష్ ఆకస్మిక మృతితో ఆయన పిల్లలు భవానీ, మహానంద, శివాని అనాథలుగా మారారు. విషయం తెలుసుకున్న దాతలు స్పందించి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. స్థానిక ఉపాధ్యాయుడు వెంకట్ రాథోడ్ కూడా సహాయం అందించారు.