హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ కమిషనర్

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, మందుల లభ్యత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.