హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయపాటికి అంతర్జాతీయ సంస్థ సభ్యత్వం

కర్నూలుకు చెందిన సామాజిక సేవకుడు అంబాసిడర్ ప్రొఫెసర్ డా. రాయపాటి శ్రీనివాస్‌కు యునైటెడ్ వాలంటీర్ల సంస్థ సభ్యత్వం లభించింది. సమాజ, మానవతా సేవలను గుర్తిస్తూ సంస్థ సభ్యత్వ ధ్రువపత్రం అందజేసింది. యువత అభివృద్ధి, విద్య, శాంతి కార్యక్రమాల్లో ఆయన సేవలను పలువురు అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.