హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు

పల్నాడు జిల్లాలో 62,866 పెన్షన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. వీటిలో 7,311 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 70 పెండింగ్‌లో ఉన్నాయి. మరో 55,485 దరఖాస్తులు రాష్ట్రస్థాయి పరిశీలనకు పంపినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పెన్షన్‌ మంజూరు చేస్తామని చెప్పే మధ్యవర్తులకు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని డబ్బువసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.