హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభిమానంతో గీసిన చిత్రం.. ఎమ్మెల్యేకు అపురూప కానుక

పెద్దమందడి మండలం చిన్నమందడికి చెందిన యువతి నందమోని హిమబిందు తన అభిమాన నాయకుడు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిత్రాన్ని చేతితో గీసి కానుకగా అందజేసింది. బాలానగర్‌లో సోమవారం ఎమ్మెల్యే దంపతులకు చిత్రాన్ని అందించగా, హిమబిందు ప్రతిభను వారు అభినందించారు.చిన్నప్పటి నుంచే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న హిమబిందు ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది.