హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత ప్రతినిధిగా వజ్రమ్మ విజయం

NLG: ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ తెలంగాణ ప్రతినిధుల ఎన్నికల్లో గట్టుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ విజయం సాధించారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి చెందిన పలువురు ఆమెను అభినందించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తామని వజ్రమ్మ తెలిపారు. తనపై నమ్మకంతో ఆదరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.