హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెస్టారెంట్‌లపై శానిటరీ బృందం దాడి

జగిత్యాల పట్టణంలో సోమవారం మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ బృందం పలు రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, శానిటరీ పరిస్థితులను పరిశీలించింది. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు గుర్తించిన పీఎంఆర్, మండీ, కింగ్స్ మండీ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుని మొత్తం రూ.25 వేల జరిమానా వేశారు.