హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం

కోనసీమ: జిల్లా పోలీస్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన డాగ్ కెన్నెల్‌ ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సోమవారం ప్రారంభించారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువుల గుర్తింపులో డాగ్ స్క్వాడ్ కీలకంగా పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. కొత్తగా ‘మాయ’ అనే నార్కోటిక్ ట్రేకర్ చేరడంతో శునకాలకు వసతి, ఆహారం వంటి సౌకర్యాల కోసం కెన్నెల్ ఏర్పాటు చేశామన్నారు.