హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు కౌలు రైతు మృతి

ELR: నూజివీడు మండలం జంగంగూడెంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు కౌలు రైతు పురిటిపాటి వెంకటరెడ్డి (65) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరెడ్డి ఎప్పటిలాగానే పశువులను మేపేందుకు వెళ్ళగా వర్షంతో పాటు వచ్చిన పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంకటరెడ్డి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.