హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి రోజు బౌలర్లదే ఆధిపత్యం

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసీస్ అండర్‌-19 రెండో అనధికారిక టెస్ట్ తొలి రోజు బౌలర్లు చెలరేగారు. భారత్ బౌలింగ్‌లో స్పిన్నర్ తన్మయ్ బలోడా (6 వికెట్లు) విజృంభించడంతో ఆసీస్ 174 పరుగులకే ఆలైట్ అయింది. అనంతరం భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 136 పరుగులు వెనుకపడి ఉంది.