హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో మహిళ

ప్రకాశం: వెలిగండ్ల మండలం తిమ్మినేని పల్లి గ్రామం వద్ద సోమవారం సాయంత్రం ఓ మహిళ అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 108కు సమాచారం అందించగా, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారే వివరాలు తెలియాల్సి ఉంది.