హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంతెన మంజూరు చేయాలని వినతి పత్రం

ASF: మోవాడ గ్రామపంచాయతీ పరిధిలోని గోగిన్ మోవాడ గ్రామానికి వెళ్లే దారిలో వంతెన మంజూరు చేయాలని గ్రామస్థులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వరావుకు సోమవారం వినతిపత్రం అందించారు. కాలువపై వంతెన లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎంపీ గోడం నాగేశ్‌తో మాట్లాడి వంతెన మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.