హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై ఎమ్మెల్యే ఆరా..!

ASR: అనంతగిరి మండలంలోని భీంపోలు ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్, బియ్యం, సరుకుల నిల్వలను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి ట్యాంకులు, వాటర్ ఫిల్టర్లు, వేడి నీరు, బాత్రూంలకు నీటి సరఫరా అందుతుందా అని విద్యార్థినులను ఆరా తీశారు.