SKLM: జలుమూరు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను విజిలెన్స్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 100 బస్తాల యూరియాను తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో విజిలెన్స్ ఎస్సై రామారావు అడ్డుకున్నారు. వాహనాన్ని ఆపి బస్తాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
100 బస్తాల యూరియా సీజ్..!


