హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం'

RR: బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడమే లక్ష్యమని షాద్‌నగర్ బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యక్రమాల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలిపారు.