హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోయినిపల్లికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం

SRCL: బోయినిపల్లి మండల కేంద్రానికి రూ.12 కోట్లతో మినీ స్టేడియం మంజూరైంది. అక్టోబర్ 3న ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. క్రీడల మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంజూరుకు కృషి చేశారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్ యాదవ్ తెలిపారు. స్టేడియంతో యువతకు క్రీడా శిక్షణ, ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.