హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం-పిప్పర రహదారిపై రాకపోకలకు ఆంక్షలు

W.G: భీమవరం-పిప్పర రహదారి (NH-254)లో గరగపర్రు వద్ద శిథిలావస్థకు చేరిన వంతెనపై అక్టోబర్ 6 నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఆర్ అండ్ బీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.