హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేసీబీల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

KRNL: కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు జేసీబీల చోరీ కేసులో అలూరు మండలం ములగుందం గ్రామానికి చెందిన శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిందితుడి నుంచి ఒక జేసీబీని స్వాధీనం చేసుకోగా మరో జేసీబీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాలతో కేసును ఛేదించిన డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ శేషయ్యని ఎస్పీ అభినందించారు.