హైదరాబాద్: 28°C
తెలంగాణ

CKM లెక్చరర్‌ను తొలగించాలి: స్వేరోస్

WGL: మహిళా NCC విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న CKM లెక్చరర్ సతీష్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు. విచారణ సందర్భంగా విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.