హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురికి జరిమానా

KRNL: జొన్నగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఒక ఆటో డ్రైవర్, నలుగురు ద్విచక్ర వాహనదారులు ఉన్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. పత్తికొండ కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.25 వేల జరిమానా విధించారు. జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.