హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

SRPT: మునగాల మండల పరిధిలోని ఎస్ఎన్ పేట గ్రామంలో సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో వేదిక ఏర్పాటు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.