హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ భూమి రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదు'

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో తమ వారసత్వ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్‌ చేసి, బ్యాంకు నుంచి రూ. 40 లక్షల రుణం పొందిన ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని పర్వతగిరి మండలానికి చెందిన బాధితులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.