WNP: పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో చేపడుతున్న భూ రీసర్వే, హద్దుల గుర్తింపు పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం పరిశీలించారు. రీసర్వే పనులను పకడ్బందీగా నిర్వహించి, రైతులకు ముందస్తుగా నోటీసులు అందించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15లోగా రీసర్వే పనులు పూర్తి చేయాలని, హద్దుల గుర్తింపులో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి


