హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ సర్కిల్‌లో అస్తవ్యస్త పార్కింగ్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు

కడప ఎన్టీఆర్‌ సర్కిల్‌లో నో పార్కింగ్‌ బోర్డులు ఉన్నప్పటికీ వాహనాలను రోడ్లపై, నో పార్కింగ్‌ జోన్లలో పార్క్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఆర్కే స్టూడియో, ఎన్టీఆర్‌ విగ్రహం మధ్యలో కార్లు నిలపడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అస్తవ్యస్త పార్కింగ్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.