హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్చి పరీక్షల్లో అధిక ఉత్తీర్ణతే లక్ష్యం'

ASR: అరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎస్. భీమశంకర్‌రావు, ఏజీఎంసీ జి. విశ్వనాథం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూనిట్ పరీక్షల ఫలితాలు, క్వార్టర్లీ పరీక్షల నిర్వహణపై చర్చించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మార్చి పబ్లిక్ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.