హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు

MNCL: మందమర్రి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏరియా జీఎం రాధాకృష్ణ నాయకత్వంలో మూసివేసిన కేకే-2 భూగర్భగని ఆవరణలో తోటల పెంపకాన్ని సోమవారం ప్రారంభించారు. ఆయిల్ ఫామ్ సాగు సింగరేణి కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారని జీఎం తెలిపారు. రెండు హెక్టార్ల విస్తీర్ణంలో 285 మొక్కలతో తోటను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.