రెండు పడవలు ఢీకొని 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కాంగో దేశంలో చోటుచేసుకుంది. పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. కాంగో నదిలో ఒక పడవ ఉబాంగి నుంచి రాజధాని కిన్షాసాకు, మరొకటి కిన్షాసా నుంచి లుకోలేలాకు వెళ్తుండగా ఈక్వెటర్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. 30 మంది మృతి


