హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. డెలివరీ బాయ్‌పై దాడి

TG: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో దారుణం జరిగింది. ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దంపతులు దాడికి పాల్పడ్డారు. లొకేషన్ తప్పుగా చూపించడం వల్ల.. ఫుడ్ డెలివరీ కొంచెం ఆలస్యం అయిందని చెప్పినా వినకుండా దాడి చేశారు. ఈ విషయం అర్థం చేసుకోకుండా.. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.