పశ్చిమబెంగాల్ సిలిగురిలో దారుణం చోటుచేసుకుంది. పశువుల దొంగతనం అనుమానంతో ఇద్దరిపై మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు వాహనాలకు గ్రామస్తులు నిప్పంటించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీసీ ఫుటేడ్ ఆధారంగా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
క్రైమ్
దొంగతనం అనుమానంతో ఇద్దరిపై మూకదాడి


