హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా - అలీగఢ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డంపర్, కంటైనర్ ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డంపర్ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం కాగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో హైవేపై సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.