HNK: జిల్లాలో నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని హనుమకొండ టౌన్ DEE జీ.సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్ ఫీడర్ పరిధిలో, 10 నుంచి 12 గంటల వరకు పెడ్డమ్మగడ్డ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


