హైదరాబాద్: 28°C
క్రైమ్

ప్రైవేట్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

TG: వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండపై ఓ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్తున్న బస్సు అదుపు తప్పడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలిస్తున్నారు.